వర్ణాశ్రమ ధర్మాలు కూడా మానవుని మనస్సును భగవంతునిపై లగ్నం చేయటానికే ఏర్పడ్డాయి. అందులో జీవితంలో ప్రతిస్థాయిలోను ప్రతి వారికి జీవన విధానము, సాంఘికమైన హక్కులు, కట్టుబాట్లు, వారికి ప్రవర్తనా నియమావళి ఏర్పరచారు. అవన్నీ చిత్తవృత్తులను నిరోధించి మనోవికాసం ఏర్పడటం కోసం ఉద్దేశింప బడినవే. వర్ణాశ్రమమనేది బాగా వేళ్ళూని ఉన్న వృక్షం వంటిది. దాని క్రింద అన్ని తరగతులవారు విశ్రాంతి పొందవచ్చు.
(వ.61-62 పు.168)