ఆలెగ్జాండర్ అనేక దేశములను జయించి, చక్రవర్తి అని పేరు గాంచాడు. కానీ, అతనికి అంత్యసమయం ఆసన్నమైనప్పుడు ఏ వైద్యుడు అతనిని కాపాడలేక పోయాడు. అలెగ్జాండర్ తానింక బ్రతకనని గుర్తించు కున్నాడు. అప్పుడు తన మంత్రులను పిలిపించి "నేను మరణించిన తరువాత నా దేహాన్ని స్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు నా రెండు చేతులూ పైకి కనిపించేలా పెట్టి వీధివీథిలోను త్రిప్పండి. అనేక దేశాలను జయించి గొప్ప చక్రవర్తిగా పేరు గాంచిన అలెగ్జాండర్ కూడా పోయే సమయంలో వట్టి చేతులతోనే పోయాడని ప్రజలకుచాటండి" అన్నాడు. అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ చివరికి తన వెంట ఏమి తీసుకు వెళ్ళగల్గాడు? ఏమీ లేదు. ఈనాడు కూడా రాజ్యాలను జయించాలనే ఆకాంక్ష పాలకులలో మితిమారిపోతున్నది. అధికార వాంఛ దినదినానికి పెరిగిపోతున్నది. అధికారం కోసం ప్రాకులాడే వారు దేశనాశకులౌతారేగాని, దేశపాలకులు కాజాలరు.
(స.సా.జ.పు.154)