శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు. ఆ కుక్క సామాన్యమైన కుక్కకాదు. ఎవరైనాభవనములోకి ప్రవేశించుటకు సమీపించిన పెద్దగ గర్జిస్తుంది. కొంతమంది ఆ కుక్క గర్జనలకు భయపడి వెనుకకు వెళ్లిపోతారు. కొందరు ఎట్లైనా ఆ యింటి యజమానిని కలవాలి అన్న తపనతో, విశ్వాసముతో వచ్చి దూరముగ నిలబడి యజమానిని గట్టిగా పిలుస్తారు. అప్పుడు యజమాని ఆ కంఠము తన మిత్రునిదని గుర్తించి క్రిందకు దిగి గేటు వద్దకు వచ్చి అతనిని లోపలికి తీసుకుపోతాడు. ఆ కుక్క తన యజమానితో వెళ్తున్న వ్యక్తిని ఏమి చేయదు. అటులనే మోక్ష సాధమునకు ముందు మాయ అనే కుక్క వుంటుంది. మాయకు భయపడక భతవంతుని ఎలుగెత్తి పిలుస్తాడు. భక్తుడు "నీవు రా నేనిక్కడే వున్నాను. నన్ను లోపలికి తీసుకువెళ్లు. నీవు తప్ప నాకింకెవ్వరు వద్దు" అని శరణాగత భావముతో ఆర్తితో పిలవాలి. అట్టి వానిని భగవంతుడే స్వయంగా చేయిపట్టి తీసుకుపోతాడు.
(భ.ప్ర.పు.39)