నిత్య సత్య, నిర్గుణ, నిరూప తత్వాన్ని గుర్తించడానికిభ్రమను దూరం గావించుకోవాలి. ఈ భ్రమ అనే మోహము, మోహగుణములచే సంభవించేది. గుణములు కల్పితములైనవి. స్వప్న దృశ్యమువంటి జగత్తులో భయబ్రాంతులు ఏర్పడుతూ వుంటాయి. "విశ్వం దర్పణ దృశ్య మాన నగరీ" విశ్వం అంతా నగరంలో ప్రతి బింబంగా కనిపిస్తూ ఉన్నా, దానికి అద్దాలకూ ఏమీ సంబంధము లేదు. నేత్రాలకు గోచరిస్తుంది. కాని నేత్రాలతో సంబంధములేదు. నేత్రాలు ఎల్లప్పుడూ సాక్షి భూతములై యుంటాయి. నేత్రాలు సర్వదృశ్యాలను చూడగల్గుతున్నాయి. కాని తమ్ముతాము చూడలేక పోతున్నాయి. ఇట్టి అంధత్వాన్ని నిర్మూలము గావించి, దివ్వత్వాన్ని ప్రాప్తింప చేసేది భగవద్గీత.
(సా.పు.537)
(చూ|| ఆచరణ, ఆత్మధర్మం, ఆనందము, ఏకత్వము, కలియుగము, దుర్మార్గమైనమార్గం, భజన, శాంతి జీవనము)