ఈ ఓణం పర్వదినం నాడు వామనమూర్తి పవిత్రత, బలి చక్రవర్తి త్యాగం మనలో ఆవిర్భవించాలి. మనం త్యాగం చేసే కొద్ది భోగము అధిక మవుతాయి! ఏ భోగములు? దివ్యమైన భోగములు. "శృణ్యంతు విశ్వేఅమృతస్య పుత్రా!" - అమృత పుత్రులగా మారాలి. హృదయాన్ని క్షీరసాగరంగా మార్చుకోవాలి. విశాల మెనర్చుకోవాలి. అప్పుడే నారాయణుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. మహావిష్ణువు క్షీరసాగరం శయనుడు. అంటే పవిత్రమైన హృదయంలో పవళించి ఉండేవాడని అర్థం.
భగవంతునికి నివాసమైన మనసును అపవిత్రమైన దుర్గుణాలకు నివాసంగా చేసుకోవడం ఎంత పాపం? దుష్టభావాలను, దుష్ట సంకల్పములను త్రుంచి పారవేయాలి. నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను నింపుకోవాలి. జీవితాన్ని భగవంతునికి సమర్పించాలి. అదే తన రాజ్యంలో బలిచక్రవర్తి చేసిన పవిత్ర కర్మ, నాటి నుండి నేటి వరకు ఈ పవిత్ర భావముల సంస్మరణగాఉత్తేజకరమైన భక్తి శ్రద్ధలతో ప్రజలు ఓణం పండుగ జరుపుకొంటున్నారు.
(జ.పు.165)
(చూ॥ పుణ్యఫలం)