"భగవంతునికి ఎటువంటి ఆలోచనలుగాని, భావములు గాని ఉండవు. ఆయనకు దేనియందు ఇష్టాయిష్టము లుండవు, అలాగే ఆయనకు కొందరి యందుకోపము, కొందరియందు ఇష్టము అంటూ ఉండదు.
ఒకే వ్యక్తియందుగాని, లేక వేరువేరు వ్యక్తులయందు గాని ఆయనకు కాలమును బట్టి మారిపోయే అభిప్రాయములుండవు. ఉన్నత కుటుంబమునకు చెందినవారనీ లేక నీచజాతివారనీ, యువకులని వృద్ధులనీ, స్త్రీయనీ పురుషుడనీ, ఈ దేశమునకు చెందినవారని పైదేశమునకు చెందినవారని భగవంతుడు విచక్షణ చూపడు. ఇవన్నీ నిరంతరం మార్పుచెందే లౌకిక ప్రపంచమునకు చెందిన భేదభావములు, దివ్యత్వమునకు వీటిలో సంబంధము లేదు. భగవంతునికి అటువంటి భేదభావము ఎప్పుడూ ఉండదు."
(దై.మ.పు.352/353)