ఆధ్యాత్మిక క్షేత్రమందు విజయమును సాధించగోరిన ప్రతి మానవుడు శీలత్రయము అతి ప్రధానము. మొదటిది పవిత్రత. రెండవది సహనము, మూడవది పట్టుదల. ఇవియే శీలత్రయము. ఎట్టి విద్యావంతుడైనా ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి అధికారియైనా ఎంతటి శాస్త్రజ్ఞుడైనా, ఎంతటి పండితుడైనా, ఎట్టి పామరుడైనా యీ శీలత్రయము లేకుండిన, వాడు బ్రతికి కూడను చచ్చినవానితో సమానము అన్నారు.
(శ్రీ.గీ.పు.224)
ఏ రంగంలోనయినా విజయం సాధించవలెనన్న మానవుడు "శీలత్రయము" తప్పని సరిగా కలిగి యుండవలయును.
1. పవిత్రత (Purity)
2.సహనం (Patience)
3. పట్టుదల (Perseverance) ఈ మూడు గల వ్యక్తులచేమన ప్రాచీన సమాజం గౌరవించింది. దీనినే "శీలత్రయము" అన్నారు. ఇంగ్లీషులో P3 అన్నారు. ఎవరియందు ఈ శీలత్రయము నెలకొని యుండునో వారిని విజయం వరిస్తుంది. వారు లక్ష్యమును నిరాటంకంగా చేరుకొనగలరు.
(దే.యు.పు. 10)