“రామా! నీవు రామచంద్రుడవు! నేను సీతాజాతను. అనగా చంద్రునినుండి వెలువడిన చల్లని శీతల వెన్నెలను, చంద్రుడు అరణ్యమందును వెన్నెల అయోధ్యయందును వుండ వీలుండదు కదా! చంద్రినిలో వెన్నెల కూడియే యుండును. కానీ వియోగము సంభవించదు. ఈ రెండింటికీ నిరంతర సంయోగమే కానీ, వియోగము సంభవించదు. సంభవించెనా అది యేదో ప్రళయ సమయము అయివుండవచ్చును. లేదా దుష్ట సంహారమునకై శిష్ట పరిపాలనకై అట్లు జరుగవచ్చును. ఈనాడు అట్టివేవియు లేవు కనుక, మన యెడబాటు వీలుకానిది, జరుగలేనిది" అని దృఢముగా పలికెను.
(రావా.మొ.పు.241)