శాస్త్ర ప్రమాణము ననుసరించి, ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అను ఆరు సుగుణములు ఉండుచోట సాక్షాత్ భగవానుడయి వసించును. ఇట్టి గుణములను ప్రభోదించుటే, గణపతి పూజ అనగా ప్రారంభము. పిరికిపందలకు ఆధ్యాత్మ క్షేత్రమున చోటే లేదు. దుర్జనులు దృఢవిశ్వాసము లేనివారు, సందేహస్తులు యేడుపుముఖము వారు, వైద్యులకు శిష్యులుగా వుండవలసిన వారే కానీ యోగులెన్నటికీ కానేరరు. జ్ఞానికి ఆజ్ఞానికి ఇదే భేదము. "ప్రహసన్నివ" కృష్ణుడు ఆనందాతిరేకములతో నవ్వుచూపలుకుట అర్జునుడు దు:ఖాకులుడై వినుట, జ్ఞానియెల్లపుడును నవ్వుతాడు. ఆజ్ఞాని యేడుస్తూ వుండును.
(స.వా.పు.163)