రమణి శిరోమణులు రావచ్చు. పోవచ్చు:
శాశ్వతమైనది సత్యమొకటె:
రాజ్య భోగములన్ని రావచ్చు. పోవచ్చు:
శాశ్వతమైనది సత్యమొకటె.
భ్రాతలు, బందువుల్ రావచ్చు. పోవచ్చు:
శాశ్వతమైనది సత్యమొకటే.
అధికార భోగముల్ రావచ్చు. పోవచ్చు:
శాశ్వతమైనదిసత్యమొకటె.
సత్యమే సరస సన్మార్గ తత్త్యము:
సత్యమేసకలసౌభాగ్యదాయకము.
సత్యమే అమృతత్వమునకు మార్గము.
సత్యమొక్కటే జగతిలో శాశ్వతము.
(స.సా.ఫి...2001 పు. 41)
(చూ! విశ్వము, సత్సంగం)