ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని తప్పించుకొనుటకు, అందులో ఉత్తీర్ణులగుటకు స్థిరమైన పట్టుదల, శాంతము ఉండవలెను. ధృతి. ధైర్యము, సమ్మతి ఇవి ఇచ్ఛాశక్తిని బాగా వృద్ధిచేయును. ముఖ వర్చస్సునందు ప్రకాశము, ప్రకాశించు కనులు, విశితమైన చూపు గంభీరమైన వాక్కు, ఉదారత, స్థిరమైన స్వభావము, నిర్భీకత ఇవి వ్యక్తియొక్క ఇచ్ఛాశక్తి వృద్ధిలగుచున్నదని తెలియపరచుటకు కొన్ని సూచనలుగా ఉండును. మనో ఆందోళన లేకుండుట, నిర్మలముగా, సంతోషముగా ఉండుట ఇవి శాంతివృద్ధికి సూచనలు.
ఇట్టి శాంతిని సద్గుణవృద్ధినికూడా ఇవ్వమని భక్తులు ప్రార్థనా మూలమున అడుగుకొనవచ్చును. అసలు సాధకుడు. దేనిని సాధించవలె నన్నను ప్రార్థనే మూలధనము.
(ప్ర.వాపు 16/17)