"భారత" అంటే భగవానుని యెడల రతిగల దేశము అని అర్ధము. భగవంతుడు మీ మధ్యకు వచ్చుటకు అదే కారణము. దీనిని యింకొక విధముగా చెప్పవచ్చు.భారతదేశములో ఒక్క కోలారు గనులయందు మాత్రమే బంగారము ఎందుకు వుండాలి? అది ఆ ప్రదేశముయొక్క అదృష్టము. గనులున్న చోటనే ఇంజనీర్లు, కెమిస్టులు ఉంటారు. వారు బంగారమును వెలికిదీసి శుభ్రపరచి అవసరమైన చోటికి బంగారమును అందిస్తారు. అదే విధంగా ఆధ్యాత్మిక ధనము - వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు, గీత అనే గనులలో నిక్షిప్తమైవుంది. అది మాకు కావాలి అని కోరేవారికి, వాటిని స్వచ్ఛమైన రూపములో అమూల్యమైన వానిగా అందించుటకు ఋషులను, మునులను భగవంతుడు పంపుతాడు. అవసరమైనప్పుడు తానే అవతరించి ఆధ్యాత్మిక ధనమును స్వచ్ఛమైన రూపములో అందిస్తాడు.
(యు. సా.)