ఈశ్వరునకు శంఖనాదము ప్రీతికరమైనటువంటిది కనుక దానితో ప్రసన్నుడై పోతాడు త్వరగా, ఆ విధమైనటువంటి ఉద్దేశముతో మన పూర్వీకులు శంఖనాదముచేస్తూ వచ్చారు. భగవంతుడు ప్రసన్నుడౌతున్నాడో లేదో అర్థం కాలేదు. కానీ, ఈ శంఖవాదము భగవంతునికి ప్రీతికరమైనటువంటి నాదమని కాశీలో విశ్వేశ్వరుని యొక్క సన్నిధిలో భుం భుం భుం" అని శంఖము ఊదుతుంటారు. ఏ పూజ చేస్తున్నా, చాలా మంది చేసే ఉంటారు. షిర్టీకేసాయిబాబాలో వస్తుంటాది. భం భం భం భం భజనకరేంగే, ఢం ఢం ఢం ఢం ఢమరుభజే అని. ఈ డం డం అనేటువంటిది ఈశ్వరునియొక్క ఉత్సాహము. అంతే కాకుండా దీనిని మరొక ఆంతరార్థము కూడా ఉంటుండాది. మనయొక్క గుండె యొక్క శబ్దమునకు ప్రతి ధ్వనియైనటువంటిది ఈ శంఖనాదమని కూడను రెండవ అర్థము. శివత్వమనేటువంటిది మనగుండెలలో ఉండినంతవరకును ఆడమరుకమనేది వాయిస్తుంటాడని శివత్వమనే డమరుకము ఎప్పుడు వాయించడో అప్పుడే శవత్యంగా మారిపోతుంది అని ఆర్థము. కనుకనే ఈ శంఖమవేటువంటిది శివత్వమునకు చిహ్నము. మంగళకరమైనటువంటి చిహ్నము.
(గు.కి.పు.49)