శంకరుడు- శం అనగా చిదానందమును అనగా సచ్చిదానందమును కరుడు అనగా అందించువాడు. సాధువుల హృదయ స్థానమందు శయనించువాడు కనుక శివుడని పేరు.
(శ్రీసా.సూ.పు.31)
శం....కర శం అనగా ఏమిటి? గాలివలే సర్వత్రా వ్యాపించే టటువంటిదే. శం గాలి ఏవిధంగా వ్యాపించుతుందో ఆవిధంగా వ్యాపించడమే ఈ శం యొక్క శక్తి. ఆనందముతో కూడినటువంటిది ఈ గాలి. కర దీనిని అందించేటటువంటి వాడు శంకరుడు. నిత్యానందమును సచ్చిదానందమును, బ్రహ్మానందమును అద్వైతానందమును మహదానందమును సర్వమునూ అందించేదే శం.....కర. ఆనందమును చేకూర్చే టటువంటిదే ఈ శంకర అన్న పదమునకు అర్థము.
(శ్రీ ఏ.1995 పు.8)
(చూ: దేవుడు, యుక్తి)