నేను నీ ప్రక్కనే యున్నాను. నీలోపల యున్నాను. నీ హృదయాంతరాళములో యున్నాను. నేను నీకు సహాయము చేయుటకు, దారి చూపించుటానికి వచ్చాను. భగవంతుని పై దృష్టి మరల్చు. నీకొరకు ఆపని చెయ్యలేను. అది నీకు నువ్వే చెయ్యాలి. నీలో యున్న భగవంతుని నావైపుకు త్రిప్పగలను కాని నీవు నా దగ్గరకు రావు. నీవు నాలో ఒక్కటి అయిపోవాలి. ప్రతి అణువు నందున భగవంతుని చూడగలగాలి. ప్రతి వారిలోను భగవంతునిప్రేమచూడు. భగవంతుని ప్రేమ నీలో యున్నదని గుర్తించుకో, అదే ఇతర ప్రేమలకంటే అతీతమైనది. నేను ఏ పని చేసినా భగవంతుని గురించే చెబుతాను. నా ప్రేమ భగవంతుని ప్రేమ,నీకళ్ళు తెరిపించడమే నా కర్తవ్యము. ఆధ్యాత్మిక జీవితం దొరకడం చాలా కష్టము. భగవద్దర్శనము నీ చేతిలోనే యున్నది నీ ప్రేమనువిస్తరింపచెయ్యి. ఈ ప్రపంచములో మహత్తరమైన దానిని పొందుటకు నువ్వునువ్వే కావాలి. అదే భగవంతుడు నువ్వు నువ్వు కావడమే భగవద్దర్శనం.
(సా. పు.332/333)