భగవ త్ప్రీ త్యర్థము

భక్తి Part time devotion గా ఉండకూడదు. Full time devotion గా ఉండాలి. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు “దేవుడా! దేవుడా! అని దేవులాడుతాము. కాని, సుఖ సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు. నిజమైన భక్తి కాదు. "సతతం

యోగినః",కాని, తెల్లవారి లేస్తే మనం యోగములో కూర్చొంటాము. మధ్యాహ్నము చూస్తే భోగములో కూర్చొంటాము: రాత్రి చూస్తే రోగములో మునిగిపోతాము. ఇది సరియైనది కాదు. తెల్లవారున, మధ్యాహ్నం,రాత్రి నిరంతరం చిత్తవృత్తులను అరికట్టుకొన్న వారిగా ఉండాలి. అదియే దివ్యమైన భావము. "సర్వం భగవత్రీత్యర్థం" అనే భావనలో మనం మునగాలి. ఏ పనైనా చేయి. నీ ఉద్యోగం చూసుకో, విద్యావంతుడిగా చదువు, అధ్యాపకుడిగా బోధించు. ఏ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తున్నప్పటికి ఇవన్నీ భగవత్రీత్యర్థం చేస్తున్నావనే సులభమైన దివ్యమైన భావముతో చేస్తే - అదియే భగవదర్పితమౌతుంది. మనస్సును సులభంగా అరికట్టడానికి ఇదే మార్గము.

(స.. సా.అ..93 పు.222)

 

చెడ్డ పని చేసి మంచిని చెందబోరు.
మంచిపని చేసి కీడును గాంచ లేరు.

అప్పుడప్పుడు మీరు అనవచ్చు-స్వామీ! మేము మంచి పని చేసినా మాకు చెడే జరిగింది అని. కానీ మీ పని మంచిది కావచ్చు. కానీ ఈ భావములలో దోషముండవచ్చు. లేకపోతే చెడు రావ డానికి వీలులేదు. స్వార్థము లేకుండ, ఇది మంచి - ఇది చెడు అను కోకుండ సర్వ కర్మలు భగవత్రీత్యర్థముగ చేస్తే - దాని వలన మీకు ఎటువంటి నొప్పి, బాధ, నష్టము కలుగదు. అన్నింటికి కారణము మన దోషములు. మన దోషములు మనకు కానరావు. ఎట్లు?

తప్పు కానక సర్వము ఒప్పుగా భావించి
ప్రకటించు చుందురు ప్రాజ్ఞ జనులు.
తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా జూచి
శ్లాఘించు చుందురు సరస జనులు
ఒప్పులను మరచి తప్పులనే గైకొని
కలహించు చుందురు కలుష జనులు
ఒప్పులన్నియు తప్పులుగా చేసి
దూషించు చుందురు దుష్ట జనులు..
మొదటి మూడింట ఒక విధమైన రీతి కలదు
నాల్గవ పక్షమందున్న వారిని నరుల నరయ
వారి కంటే రాక్షసుండే మేలు.

మంచిని చెడ్డగా తీసికొనడము, చెడ్డను మంచిగా తీసికొనడము, ఇది దానవత్వానికి కారణము. మానవత్వము మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా తీసుకుంటుంది. చెడ్డలో కూడ మంచినే తీసుకునేవారు ఉత్తములు. ఉదా॥ బీకటి, చీకటి అంటున్నాము. చీకటిలో కూడ ఒక విధమైన వెలుతురు ఉంది.

పగటి వేళల చుక్కలు కనపడని భంగి
శ్రీ కరుండైన పరమాత్మ నీకు నరుడా,
కానరానంత మాత్రాన-
అతడు లేడని అనగలమా ?

పగలు కూడ ఆకాశములో నక్షత్రము లున్నవి. కానీ అవి కనుపించవు. ఎందుచేత? వెలుగు ఎక్కువగా ఉండటము చేత దానిని చీకటి ఆవరించినది. కానీ రాత్రి పూట మనకు చీకటి ఏర్పడటం చేత యీ చుక్కలను చూస్తున్నాము. కాబట్టి చీకటిలో వెలుతురు, వెలుతురులో చీకటి ఉంటుంది. . ఇది - Scientific Truth. వెలుతురు చీకటి ఒకదాని కొకటి సంబంధము లేకుండ ఉండ లేదు. కానీ మనము చీకటిని, వెలుతురును వేరుగా భావిస్తాము. ఇది ఒక భ్రమ. నేను యిదివరకే ఒకసారి చెప్పాను. మన నోటి లోనికి పోయే అనేక వేల మెతుకులను లెక్క పెట్టము. కానీ రెండు రాళ్ళు పంటిక్రింద చేరెనా ఆడవాళ్ళను కోప్పడుతాము. మంచిని మరుస్తాము. చెడ్డనే చూపుతాము. . అదే విధముగ మనలో జ్ఞానమనే వెలుతురు, అజ్ఞానమనే చీకటి, రెండు ఉన్నాయి. ఈ విధముగ ప్రపంచములో అంతా రెండు, రెండుగానే ఉంటుంది. కష్ట సుఖములు, చీకటి వెలుగులు, ఇది ప్రపంచ స్వభావము. ఒకటి లేక మరొకటి ఉండదు. కష్టములో సుఖము, సుఖములో కష్టము ఉంటుంది. ఇంతే కాక ఒకే సంఘటన ఒకరికి మంచి చేయవచ్చును. మరొకరికి ఏమీ చేయకపోవచ్చును. ఉదా॥ సూర్యోదయమున కమలము వికసించును. సూర్యా స్తమయమున కలువ వికసించును. సూర్యోదయము కాగానే మనకు సంతోషము, రాత్రి కాగానే దొ0గ లకు సంతోషము. ఈ విధంగా సూర్యోదయము కొందరికి సంతో షము నందిస్తే సూర్యా స్తమయము మరి కొందరికి సంతోషము నందిస్తున్నది. కాలమునందు దోషము లేదు. - కర్మలందున్నది. కాబట్టి మనము చేయవలసినది మనకు నిర్ణయింపబడిన కర్మలను. నిందాస్తుతులకు, దూషణ, భూషణలకు ఏ మాత్రము చలించకూడదు. ఒకసారి దూషణ కూడ మంచిని అందించవచ్చును అది నీ అహంకారమును దూరము చేయవచ్చును. - భూషణ వలన నీ అహంకారము పెరుగవచ్చును. కాబట్టి రెండు అవసరమే. రెండింటి యందు సమత్వమును చూపాలి. ఇట్లు పొంగక, క్రంగక ఉన్నటువంటి - తత్వమే ఆత్మ తత్వము. (శ్రీ సత్యసాయి దివ్యబోధ 1978 పు 168-171)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage