బ్రహ్మయజ్ఞమనగా స్వాధ్యాయ. లోక కళ్యాణార్థమై బ్రహ్మనుగ్రహమును పొంది అజులగు అధికారులను ఋషులు యజ్ఞములను సృజించిరి. మంత్రములను దర్శించిన వారు వేద చోదితమైన పరమార్ధమును, ధర్మ బ్రహ్మస్వరూపమును దర్శించువారిని మాత్రమే ఋషులని వేదము తెలిపినది. అట్టివేదము అంగీకరించిన ఋషులు సృజించిన క్రతువులే యజ్ఞములు.
తపస్సుచే లభించిన దగుటచే బ్రహ్మతత్వము తపోజా" అని కూడా దేవుని లక్షణాలను వర్ణించిరి దీనినే దైవీవాక్, దేవ వాణి అనిరి. తపోవా అనుటచే, అంతకు పూర్వములేక కొత్తగా పుట్టినది కాదు. అనాది సిద్ధమైన వేదవాణి యే తపస్సు వలన అభివ్యక్తమైనది. స్వాయంభువమగు బ్రహ్మ, ఇది అనాది సిద్ధమైన వాక్కు అని స్పష్టము చేయుచున్నది. స్వయంభూ తపోజా-ఇత్యాది పదములనుపురస్కరించుకొని దైవీవాక్ వేదమునందు అచటచట మంత్రకృత్, ఋషికృత్, ఇత్యాది పదములను అనుసరించుచు ఈ వాక్-మంత్ర- మంత్ర కర్త్మ -రచితమై చెప్పబడినది.
అన్నము, జలము, అమృతము, వేదము- ఇవి పృశ్ని అని చెప్పబడుచున్నవి. ఇవి ఎల్లప్పుడు భగవంతుని గర్భమునందుండునవి కాన భగవంతుడు పృశ్నిగర్భుడని కూడా బ్రహ్మనే తనకు తాను వేద రూపమున తెలుపుకొన్నాడు.
(లీ.వా.పు.14/15)