"దేహములోని సర్వాంగములు అతి సుందరంగా అతి పుష్టిగా వుండినప్పటికిని, వీటన్నింటికీ ఆధారమైన గుండె గనుక ఆరోగ్యముగా లేని యెడల అవన్నియూ ఎంత నిష్ప్రయోజనమో, అదే విధముగ మీకు భౌతికంగా, లౌకికంగా రాజకీయముగా, వ్యాపారికముగా అన్నియునూ పుష్టిగా తుష్టిగా వుండినప్పటికినీ భగవత్ చింతన లనెడి గుండె లేని యెడల మీరు నిర్జీవులే. కనుక మీమీ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ భగవత్ చింతన ను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. భగవత్ చింత”వలన మీకు సర్వక్షేమములు, సర్వానందములు, సర్వ సుఖములు చేకూరుతాయి".
(సా..లీ.త.పు.70)
(చూ|| స్వస్థానము)