ఈ దేహం ఒక బంతి. దీనిలో దివ్యత్వం అనే గాలిని నింపారు. ఆరుగురు శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) ఒక వైపు నుండి దీనిని తంతూ, ఆడుతున్నారు. మరోవైపు ఆరుగురు మిత్రులు (సత్యం, ధర్మం, శాంతి. ప్రేమ, కరుణ, ధృతి) ఆడుతున్నారు. రెండువైపులా గోలు పోస్టులున్నాయి. ఆగోలు పోస్టుల మధ్యగా వెళ్ళేలా బంతిని తన్న గలిగితే గోల్ అవుతుంది. అంటే ధర్మవిద్య సాధించి గెలుపొందుతారు. లేకపోతే ఆతోపుకు వీళ్లవుటవుతారు. ఇదే భగవంతుని లీల!
(శ్రీసా.గీపు. 29)