ఒకానొక సమయంలో త్యాగరాజుకు మహారాజు ధనమును, తిండి పదార్థములను పంపించాడు. త్యాగరాజు, నిధి చాల సుఖమా? ఈశ్వర పన్నిధి చాల సుఖమా? నిజముగ తెలుపుము మనసా" అన్నాడు. “నాకు ఈశ్వర సన్నిధే కావాలి. రాముడే నా ధనము. ఆతని పాదసేవయే నా విధి. ఈ ధనము నాకు అక్కరలేదు, తీసుకు పొమ్మ"న్నాడు. అప్పుడు వారు చెప్పారు. "పేరుకు తగినట్లు త్యాగము నీలో ఉంటున్నది అని. అతని పేరే త్యాగరాజు. పేరుకు తగిన త్యాగము పూనాడు. ధనమును తీసుకుంటే అతడు భోగరాజు అయిపోయేవాడు, తరువాత రోగరాజు అయిపోయేవాడు. భోగము వద్దు, రోగము వద్దు, త్యాగం కావాలి. మన మందరము త్యాగమయ జీవితమును గడపాలి. అదే మనకు భోగము, స్వర్గము. త్యాగముకంటె మించినది మరొకటి లేదు. కనుక త్యాగ జీవులై, శాంతముగా జీవించండి.
(దయ స 98 పు.100/101)
(చూ॥ అంగహీనుడు, దైవవిశ్వాసము, పాత స్నేహితుడు, ముగ్గురు రాజాలు)