నీవు వెలుతురు చూచినప్పుడు ఉత్తేజడవు కానట్లయితే నీవు నాకు చాలా దూరంగా వున్నావనే అనుకోవాలి. నీకు నాకు వున్న సంబంధములో ఇదే సత్యము.
(సా, పు. 398)
దివ్యత్వమునుండి వచ్చినదే ఈ పవిత్రమైన మానవ జీవితము. ఈ లక్షణాన్ని కొంతమంది ఋషులు గుర్తించి దీక్షను బట్టి సాధిస్తూ వచ్చారు. "ఈ దివ్యమైన తేజస్సు మీరు చూడండి" అని లోకానికి చాటినారు.” అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః" అతడు ఎట్లా ఉన్నాడంటే, "వేదాహ మేతం పురుషం మహాంతం అదిత్యవర్ణ తమస: పరస్తాత్" అని అన్నారు. ఆ మహాపురుషుని ఏ విధంగామా వర్ణించడానికి వీలుకాదని, సూర్యతేజస్సువలె ప్రకాశిస్తున్నాడని పేర్కొన్నారు.
(శ్రీ భ.ఉ.పు.30)
(చూ ప్రణవతత్త్వము)