మనకు తెలివి తేటలు అధికముగా వుంటున్నాయి. తెలివి తేటలుండి సక్రమమైన మార్గములో ప్రవేశించకుండా పోతే అవి నిరుపయోగమైపోతాయి. తెలివితేటలు లేకుండా కార్యములో ప్రవేశిస్తే కార్యము నిష్ప్రయోజనమై పోతుంది.
Knowledge without action is foolishness
Action without knowledge is useless
ఈ knowledge ను మన action ను రెండింటిని ఏకముచేయాలి. ఇదే దివ్యత్వము. ప్రకృతి తత్వము. రెండింటి యొక్క ఏకత్వము ఈ creation భగవంతునికి వేరుగా లేదు. భగవంతునిలోనే కూడి వుంటుండాది. జీవ, ఈశ్వర, ప్రకృతి అని త్రిమూర్త్యాత్మక స్వరూపము. ఈ మూడు వేరు కాదు. వేరు వేరు రూపనామములుగా మనకు గోచరిస్తుందే గాని మూడు చేరి ఒకటే..
(బృత్ర, పు. ౧౧౯/౧౨౦)
దేవునెరుగునట్టి తెలివి ఒక్కటే చాలు
తత్తరంబు తెలివి తట్టడేల?
దేవు నెరుగలేని తెలివేమి తెలివయ్యా
ఉదర పోషణ కొరకు ఓటు తెలివి!
(మధుర భక్తి పు 169)