మీరు దివ్యత్వంలో వర్తిస్తున్నారు. దివ్యత్వమే మిమ్ములను నడిపించే శక్తి పరమాణువు మొదలుకొని మహత్తర నక్షత్రం వరకూ సమస్తమూ నిఖిల విశ్వసమూ దివ్యత్వ పరిపూరితమే. సకల చరాచరపరివ్యాప్తమైన ఈ తత్వమునకు మీకు నచ్చిన నామరూపాలు కల్పించు కోండి. మనోనేత్రం ముందు ఆ రూపం నిలుపుకొని నాలుకతో నామం స్మరించండి. అదే జప సహితమైన ధ్యానం.
(వ. 1963 పు.66/67)