"తప్పుగానక సర్వమొప్పుగా భావించి
ప్రకటించుచుందురు పరుష జనులు
తప్పులే గైకొని ఒప్పులు దిగద్రొక్కి
ప్రకటించుచుందురు ప్రాప్తజనులు
ఒప్పులన్నియు బల్మి తప్పులుగా మార్చి
కలహించుచుందురు కలుష జనులు
ఒప్పులే దిగద్రొక్కి తప్పుల నెక్కించి
దూషించుచుందురు దుష్టజనులు
మొదటి మూడింటివారి కొక విధము కలదు
నాల్గవ లక్షణమందున నరుని నరయ
ఇతని కంటెను ఘనరాక్షసుండె మేలు"
(శ్రీ న 93 పు.54)