కృష్ణుడు గోపికల యింటికి వెళ్ళేవాడు. వారు పనులు చేసుకుంటూ తలుపులు వేసుకునేవారు. తలుపులకు చిన్న చిన్న రంధ్రములు పెట్టుకునేవారు. అత్తలు యింట్లో వున్నపుడు గుడ్డలు పెట్టేవారు. వారు లేనప్పుడు అవి తీసి కృష్ణుడే మన్నా వస్తున్నాడేమో చూసేవారు. ఒకనాడు రాత్రి కృష్ణుడు ఒక గోపిక యింటికి వచ్చాడు. భర్త భోజనం చేసి పడుకున్నాడు. కృష్ణుడు చప్పుడు చేస్తున్నాడు. ఏం చేయాలో తోచలేదు. మాట్లాడేందుకు వీలుగా చిన్న pipe ను తయారు చేసి పెట్టుకునేవారు. గోపిక చెప్ప్తుంది.
తలుపు తీయనంత లోనే తత్తరమది యేలనోయి
తలుపు తీతు కొంత సేపు తాళుము కృష్ణా
తలుపు తీతు కొంత సేపు ఆగుము కృష్ణా
పతి నిద్దురపోవలేదు మది సంశయ ముందునేమొ॥
ఒకవైపు పతికి, మరొకవైపు జగత్పతికి సంతృప్తి నందిస్తూ వచ్చారు. ఆ నాటి గోపికలు ఇహధర్మము నాచరిస్తూ పర ధర్మానికి ప్రాణము లర్పిస్తూ వచ్చారు.
(వే.ప్ర. పు.85/86)