లోకానికి ఎన్నియో బోధలు చేశాడు. వ్యాసుడు. వ్యాసోనారాయణో హరి: అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు. వ్యాస పౌర్ణిమ అన్నారు. అనేక వేదములుగా నున్నదానిని ఉద్దరించుటకు చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకమునకందించాడు. అలాంటి విభాగము గావించిన వ్యాసునికి హృదయము పవిత్రంగా మారిపోయింది. ఈ ప్రపంచమునకు పవిత్రమైన వేదమాతను అందించాను కదా యని తృప్తి పడ్డాడు. ఆ సంతృప్తి పడిన దినమే పూర్ణిమ, పూర్ణముగా ఉంటున్నాడు చంద్రుడు. చంద్రునకు, మానవుని మనస్సునకు సంబంధము ఉంటున్నది. ఈ వేదమే "చంద్రమా మనసోజాత: చక్షో సూర్యో అజాయత” - చంద్రుడు, మనస్సు రెండు ఒక్కటే, బింబ ప్రతిబింబములే, పూర్ణిమ దినమున పూర్ణ చంద్రుడు ఏ విధముగా పూర్ణముగా ఉంటాడో ఆ విధముగా మనసు పూర్ణముగా ఉంటుండాలి. ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి మచ్చలు లేకుండా ఎట్టి దురభ్యాసములు లేకుండా, పవిత్రముగా స్వచ్ఛముగా ఉంటుండాలి. ఈనాడు పవిత్రమైన భావముతో వేదములు విభజించినవాడు కనుక వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు. గురుపూర్ణిమ కాదు. హృదయమును ఏనాడు పరిశుద్ధము గావించుకుంటామో ఆనాడే గురుపూర్ణిము. మర్మమెరిగిన మరు నిముషములో మనసే వారికి గురువండి అన్నారు.
మర్మము ఏనాడు తెలుసుకుంటాడో ఆనా డు తన మనస్సే గురువు అవుతుంది.
(శ్రీ.స. పు.84)