గవర్నమెంట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా నియమ నిబంధనలను పాటించేలా చూసుకోవటం. గవర్నమెంట్ కంటే గొప్పది గాడ్ మెంట్. ఆదర్శవంతమైన గవర్నమెంట్ కావాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను గుర్తించాలి. కానీ, ఈనాడు అందరూ బాధ్యతలను విస్మరించి రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సోమరితనానికి చోటివ్వరాదు. ఉద్యోగస్తులందరూ తాము తీసుకునే జీతాలకు తగినంత పని చేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. జీతానికి తగిన పని చేయకపోతే దేశానికి ద్రోహం చేసినట్లే.సమత,సమగ్రత,సమైక్యత,సౌభ్రాతృత్వములనుఅలవర్చు కోవాలి. ఈ వస్త్రమునుచూడండి.చాల గట్టిగా ఉంది. దారాలను విడదీశామనుకోండి. వాటిని చిన్న వ్రేలులో కట్ చేయవచ్చు. ఐకమత్యంలో ఎంతో బలమున్నది. భారత దేశము స్వాతంత్య్రాన్ని సాధించిందిగాని,ఐకమత్యాన్నిసాధించలేదు. వ్యక్తి స్వేచ్ఛఉండవలసించే,ఎంతవరకు?ఎదుటివ్యక్తికిఅడ్డు తగలనంతవరకుమాత్రమే.ఒకగృహస్థుడు ఒకనాటి ఉదయం వాకింగ్ స్టిక్ (చేతి కఱ్ఱ) పట్టుకుని పబ్లిక్ గార్డెన్ లో పచార్లు చేస్తున్నాడు. ఆ కఱ్ఱను అటూ ఇటూ ఊపుకుంటూ నడుస్తున్నాడు. ప్రక్కనే వస్తున్న వ్యక్తి ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. ఈయన "ఇది నా చేతి కఱ్ఱ. నాకు స్వేచ్చ ఉన్నది. అందుకని ఊపుకుంటూ నడుస్తున్నాను" అన్నాడు. అప్పుడా వ్యక్తి, "అయ్యా! నీకు స్వేచ్ఛఉన్న మాట నిజమే చేతి కఱ్ఱ కూడా నీదే, కాదనటం లేదు. కానీ, దానిని అటూ ఇటూ ఊపటంచేత అది నా ముక్కుకు తగిలే ప్రమాదముంది. నీ స్వేచ్చ నా స్వేచ్ఛకు అడ్డు రానంతవరకే అని గుర్తించు" అన్నాడు. వ్యక్తి మాత్రమే ప్రధానమని భావించకూడదు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగాలకోసం ప్రభుత్వంపై ఆధారపడక "స్వీయ దేశీయ శ్రేయ సౌభాగ్య మరసి శ్రామిక విద్యలన్ నేర్వవలయు" మీ చదువులను సామాజిక సౌభాగ్యానికి, వికాసానికి వినియోగించాలి. ,
( స.సా. జూ లై..99 పు. 193/194)