చేప-చీమ

ప్రతి ఒక్కడు "దేవుడు - దేవుడు"అనే పదములను మాత్రమే ఉచ్చరిస్తున్నాడే గాని. “దేవుడుఅన్న ఆపదమును తెలుసు కోవటానికి తగిన కృషి చేస్తున్నాడా! మంచి తనమునకు మారుపేరే దేవుడు. ఆ మంచితనము మనలో ఎంత ఉందిఅది లేనప్పుడు ఈ దైవత్వం ఎట్లా అర్థమవుతుందిప్రతిదానికి ఒక స్వానుభవం కావాలి. లోతుగా ప్రవహించే గంగాజలంలో చిన్నచేప పైన తేలుతూ ఆనందముగా ఆడుకుంటూ ఉంటుంది. ఆ ఈత తెలిసిన చేపకు లోతు సంగతి అక్కరలేదు. కాని పెద్దశరీరమైన ఏనుగైనా గంగలో మునిగినప్పుడు కొట్టుకొనిపోతుంది. ఆ జలప్రవాహము నుండి రక్షింపబడే శక్తి సామర్థ్యములను గుర్తించాలి. మట్టిలో చక్కెర కలిసినప్పుడు చిన్న చీమ ఆ చక్కెరను తాను వేరుగా విభజిస్తుంది. చక్కర రుచి ఈ చీమకు తెలిసినది కమకనేఆ చక్కెరను ఇసుక నుండి వేరుచేస్తుంది. కానిఆ చక్కెర మాధుర్యమునురుచిని తెలియని ఎంత పెద్ద ప్రాణి అయినా ఆ చక్కెరను వేరుచేయుటం సాధ్యముకాదు. ఆవిధముగనే దైవ ప్రేమనుదైవానందమునుసచ్చిదానందమును చక్కగా అనుభవించిన వాడు. ఈ అనవసరమయినలౌకికమయిన మార్గములో పోగలడాఅది తెలియనివాడే ఈ లౌకికములోపల ప్రవేశిస్తాడు. అది తన యందే వుంటున్నది. అన్ని పవిత్రమైనదివ్య మయిన భావములు తన నుండియే ఆవిర్భవిస్తాయి.

(స. సా.మా. 1991 పు.59/60)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage