వ్యక్తి యొక్క ధర్మము, కుటుంబము యొక్క ధర్మము, సాంఘిక ధర్మము అనే ధర్మ త్రయమును తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది. రాముడు దయాసాగరుడు, ప్రేమస్వరూపుడు. కనుక, రామ తత్త్వాన్నిప్రేమచేతనే గుర్తించటానికి సాధ్యమవుతుంది. మానవత్వంలో అంతర్భూతమై ఉన్న ప్రేమ తత్త్వాన్ని మానవుడు అభివృద్ధి పర్చుకున్నప్పుడే దివ్యమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. నేటి సమాజానికి రామాయణం అత్యవసరం. కారణమేమిటి? ఈనాడు పుత్రుడు తండ్రి మాట వినటం లేదు. తల్లి దండ్రులు పుత్రుని యొక్క శ్రేయస్సును గురించి ఆలోచించటం లేదు. శిష్యునికి గురువుయందు విశ్వాసం లేదు; గురువు శిష్యునికి హితమును బోధించుట లేదు. ఇట్టి పరిస్థితులందు సమాజానికి రామాయణంలో అంతర్భాగమై ఉన్న ధర్మాలు అత్యవసరం. వ్యక్తి యొక్క నిజత్త్వమును వెల్లడించునదే రామాయణం. మానవత్వాన్ని వివరించి ప్రబోధించునదే రామాయణం. సోదరుల మధ్య ఉండవలసిన ఐక్యతను, తండ్రీ బిడ్డల మధ్య, గురుశిష్యుల మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యమును విపులీకరించి బోధించునదే రామాయణం. భారతీయ సంస్కృతి “సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం"అని ప్రబోధించింది. మొదటిది నైతిక విలువ. రెండవది ధార్మిక విలువ, మూడవది ఆధ్యాత్మిక విలువ. ఈ నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్త్వములు మూడూ రామాయణమునందు ఇమిడియున్నవి.
(స.సా. మే. 99 పు.113/114)
వ్యక్తి యొక్క ధర్మము, కుటుంబము యొక్క ధర్మము, సాంఘిక ధర్మము అనే ధర్మ త్రయమును తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది. రాముడు దయాసాగరుడు, ప్రేమస్వరూపుడు. కనుక, రామ తత్త్వాన్ని ప్రేమచేతనే గుర్తించటానికి సాధ్యమవుతుంది. మానవత్వంలో అంతర్భూతమై ఉన్న ప్రేమ తత్త్వాన్ని మానవుడు అభివృద్ధి పర్చుకున్నప్పుడే దివ్యమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. నేటి సమాజానికి రామాయణం అత్యవసరం. కారణమేమిటి? ఈనాడు పుత్రుడు తండ్రి మాట వినటం లేదు. తల్లి దండ్రులు పుత్రుని యొక్క శ్రేయస్సును గురించి ఆలోచించటం లేదు. శిష్యునికి గురువుయందు విశ్వాసం లేదు; గురువు శిష్యునికి హితమును బోధించుట లేదు. ఇట్టి పరిస్థితులందు సమాజానికి రామాయణంలో అంతర్భాగమై ఉన్న ధర్మాలు అత్యవసరం. వ్యక్తి యొక్క నిజత్త్వమును వెల్లడించునదే రామాయణం. మానవత్వాన్ని వివరించి ప్రబోధించునదే రామాయణం. సోదరుల మధ్య ఉండవలసిన ఐక్యతను, తండ్రీ బిడ్డల మధ్య, గురుశిష్యుల మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యమును విపులీకరించి బోధించునదే రామాయణం. భారతీయ సంస్కృతి “సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం" అని ప్రబోధించింది. మొదటిది నైతిక విలువ. రెండవది ధార్మిక విలువ, మూడవది ఆధ్యాత్మిక విలువ. ఈ నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్త్వములు మూడూ రామాయణమునందు ఇమిడియున్నవి. (శ్రీవాణి ఏప్రిల్ 2022 పు 4)