(చూ॥ సీత)||
చక్క చేసుకోండి
పూర్వం పుట్టపర్తి ఒక చిన్న పల్లె. అప్పుడు దీని జనాభా వందల్లో ఉండేది. అలాంటి చిన్న పల్లెలో యూనివర్సిటీ రావడ మేమిటి! ఎయిరో డ్రమ్ రావడ మేమిటి! సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడమేమిటి! రైల్వే స్టేషన్ రావడమేమిటి! ఇవన్నీ చూస్తుండగానే ఈ పల్లెలో జరిగిపోతున్నాయి. ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో జరుగునున్నాయి. మీకు తెలుసు, స్వామి చెప్పనక్కర లేదు. ఈనాడు మీరు ఇంత దగ్గరగా కూర్చున్నారు. ఇంకా కొంత కాలమునకు కొన్ని మైళ్ళ నుండి మీరు స్వామిని చూడవలసి వస్తుంది. కనుక,
చిక్కిన సాయిని వ క్కలేయక చక్క చేసుకోండి
పోయిన చిక్కదు ప ర్తీశుని పాద సేవయండి
భక్తిని ఇచ్చి శక్తిని పెంచి ముక్తి చేర్చునండి
ఇతరుల మాటలు ఇంపుగ నమ్మి కొంపతీయకండి.
నేర్చుకోండి ఈ బుద్దుల న్నీ , తీర్చుకోండి కర్మను.
విద్యార్థులారా! ఈ ప్రమాదాన్ని తెప్పించుకోవడమే మీకోసం తెప్పించుకున్నాను. మీ అందరి ప్రార్థనలను ఆలకించి, ఇప్పుడు మీకోసమే దీనిని నయం చేసుకుంటున్నాము. దీని గురించి ఇంకేమీ యోచన పెట్టుకోకండి. నేను 100% పర్‌ఫెక్ట్ గా ఉన్నాము. మీరు స్వామి చెప్పినట్లు నడుచుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణులై, చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ప్రపంచానికి ఆదర్శాన్ని అందిస్తూ రండి. అదే నేను ఆశించేది.
వాలంటీర్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు కూడా నూరు షెడ్లు ప్రత్యేకంగా వేయిస్తున్నాము. విదేశీయులకోసం కొండపై 150 ఎకరాల స్థలంలో షెడ్లు వేస్తాము. రాబోయే 75వ బర్త్ డే కి ఎవరికి ఎక్కడ చోటు చిక్కుతుందో! అయితే స్వామిదయ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా స్వామివారే అవుతారు. ఎల్లప్పుడు స్వామిమీ వెంటనే ఉంటాడు. కనుక స్వామి దూరమవుతాడనే భ్రాంతికి ఏమాత్రం అవకాశ మివ్వకండి. స్థిరత్వాన్ని పెంచుకోండి.
(స. సా. ఫి. 99 పు.36/37)