విద్యార్థినీ విద్యార్థులారా! మన పవిత్ర సంస్కృతిని ఆధునిక జీవితాన్ని రెండింటిని సమన్వయపరచి, సత్యమార్గమును విడువక, ధర్మమార్గమును విసర్జించక, న్యాయ మార్గములో జీవితాన్ని గడపటానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారము ప్రధానము కాదు. అధికారములు కేవలము కదిలిపోయే మేఘములు దాని నిమిత్తమై గర్వించ నక్కరలేదు.
"మా కురు ధనజన యౌవనగర్వం
హరతి నిమేషాత్కాల స్సర్వం”
మనిషిలో క్షణములో వచ్చి క్షణములో పోయేదే యీ యౌవనము; మధ్యలో వచ్చి మధ్యలో పోయేదే యీ యౌవనము. ఇలాంటి క్షణ భంగురమైన మధ్యకాలములో వచ్చిపోయే యౌవనమును ఆధారము చేసుకొని భ్రష్టుపట్టి పోరాదు. ఇది చాలా ఉత్తమమైన జీవితము. ఇది పవిత్రమైన కాలము. ఈ కాలము మనము వర్ణముచేసుకోరాదు.
(బృత్ర.పు.11)