"నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకొనుడు. ఈ ఉత్తమావకాశమును జారవిడువకుడు. ముక్తి మార్గముకై నన్నర్ణింపుడు. ముందు ముందు నా దరిచేరుట దుర్లభము. నలుదిశల నుండి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టు చున్నవి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించు విశ్వవృక్షముగా పెరుగుట తధ్యము. ఆ లక్ష్యముతోనే ఈ ఆకారమును ధరించి అవతరించితిని. నా సంకల్పము నిర్వికల్పము. నా పేరే సత్యము సత్యమే నా ప్రచారము సత్యమే నా మార్గము. నేనే సత్యము"
(స. శి.సు..ర్పపు.11)