తారకాసురుని దోర్దర్ప మణచు వేళ
గౌరి తనయు కిడ్డ వీర రక్ష
శంబరాసురుని జంపగా చను వేళ
భార్గవి సురు కిడ్డ భవ్య రక్ష
మాత్మదాసీత్వము మాన్ప నురుకు వేళ
వినత పుత్రు కిడ్డ విమల రక్ష
జనకు మాటగావ పనికి వేగెడు వేళ
తల్లి రఘువు కిడ్డ ధర్మ రక్ష
అట్టి శ్రీ రక్ష ఘన రక్ష యజ్ఞ రక్ష
రక్షలందువ దివ్యమౌ శ్రీరామ రక్ష
తోడునీడై నిన్ను కాపాడుగాక
(భ.ప్ర.పు. 18/19)