హజరత్ మహమ్మద్ అల్లాను ప్రార్థన చేస్తున్న సమయములో ఆయనకు కొన్ని శబ్దములు వినిపిస్తూ వచ్చాయి. తాను విన్న సుశబ్దములను హజరత్ మహమ్మద్ మక్కాలో శబ్ద సంభాషణల క్రింద చాటుతూవచ్చాడు. కాని అక్కడ చాలామంది నానా కష్టములు పెట్టి చివరకు అతనిని మక్కా నుండి తరుమగొట్టారు. ఎన్ని హింసలు పెట్టినప్పటికీ సత్యమే జయిస్తుందని, దైవమే రక్షిస్తాడని, ఆత్మ నిరంతరము సుఖస్వరూపమైనదని చివరి ఘడియ వరకూ బోధించినాడు మహమ్మద్. ఇట్టి మహమ్మద్ సుసూక్తులను ఆచరణలో పెట్టి, దివ్య స్థానమును పొందే నిమిత్తమై ఈ రంజాన్ ఉపవాస దీక్షను మహమ్మదీయులు స్వీకరించారు.
(స. సా..ఆ.83 పు.186)
(చూ॥ ఉపవాసం)