నీవు భగవంతుని సమీపించడానికి చేసే ప్రతి ఒక్క అడుగుకు, భగవంతుడు కూడా నీవైపు పది అడుగులు వేసి ముందుకు వస్తాడు. ఈ తీర్థయాత్రలో ఆగడమనేది లేదు. ఇది నిరంతర ప్రయాణము. రాత్రింబవళ్ళు, లోయల గుండా, ఎడారుల గుండా, కన్నీళ్ళతో, చిరునవ్వుతో, జనన మరణాలతో సమాధుల నుంచి గర్భకోశం వరకు సాగే ప్రయాణం. రోడ్డు చివరకు వచ్చి, గమ్యం చేరుకొన్నప్పుడు, యాత్రికుడు తన నుంచి తనలోనికేపయనించినట్లు తెలుసుకొంటాడు. ఆ దారి సుదీర్ఘం, ఒంటరి ప్రయాణం, కాని ఆదారిలో నడిపించిన భగవంతుడు అంత సేపు తనలోనే ఉన్నాడు. చుట్టూ ఉన్నాడు. తనతోనే ఉన్నాడు. తన ప్రక్కనే ఉన్నాడు!
(అ.ప.పు.4)