అది కావాలి ఇది కావాలి” అని దేవుడిని ఏదీ కోరకూడదు. ఆయన యిచ్చ ప్రకారం అన్నీ జరగనీయాలి. తన అంత్యక్రియలను రాముడే చేయాలని జటాయువు కోరాడా? తన కుటీరాన్ని పావనం చేయమని శబరి రాముణ్ణి ఆహ్వానించిందా? ప్రేమ విశ్వాసం,పవిత్రత వీటిని సంపాదించి పెట్టుకోండి! రాముడే మీ దగ్గరకు నడుచి వస్తాడు. మిమ్మల్ని రక్షిస్తాడు.
శమదమాదులంటే స్వామి కృప ఆయాచితంగా లభిస్తుంది.
(శ్రీ.సా.గీ.పు.330)