ఒకానొక వృద్ధునకు అంత్యకాలం వచ్చినది. అతడు కన్నడ దేశమువాడు. అతడా తుది క్షణములలో, ఏదో మాట స్పష్టముగా మాటి మాటికిని అనసాగినాడు. తాను ధనము దాచిన చోటును చెప్పుచున్నాడు. కాబోలు ననుకొని, కొడుకులు ఆ మాటను తెలిసికొనుటకు బహు ప్రయత్నము చేయగా, తుదక మాటలోని మొదటి అక్షరము అని తెలిసింది. అప్పుడు వారు - కనకమా(బంగారమా?); కరా (ఆవుదూడా?); కనజా (ధాన్యపు కొట్టా?); అని అడుగగా, వృద్ధుడు అదియేదియు కాదన్నట్లు తల ఊపి, తన యెదుట చీపురు కట్ట నమిలివేయుచున్న బఱ్ఱె దూడ వైపు చేయి చూపి, ప్రాణం వదిలినాడు. కసబరిక" అనేది ఆ వృద్ధుడన్న మాట. కన్నడంలో కనబరిక అనగా చీపురు. దూడ చీపురు పాడు చేయుచున్నదనియు, దానిని భద్రపరుచుడనియు నాతడుచెప్పదలచుకొన్న మాట. తుది క్షణమున అతని మనస్సు చీపురు మీద నిల్చిది కావున, అతడు మరు జన్మలో, వీథు లూడ్చి బ్రతుకువాడుగా పుట్టవలసి వచ్చింది. "యాంతే మతి స్సా గతి:
(స.పా.మే.99 వెనుక కవరు పుట)