ఈనాడు లోకంలో నాస్తికత్వానికి, ఆస్తికత్వానికి మూలకారణం ఎవరంటే ఉమెన్ (women) అని నిర్ణయమైపోయింది. లోకకల్యాణమునకుగాని, లోకములో బాధలకు, గాని వారే మూలకారణమని కూడను నిర్ణయమైపోయింది. లోకములో పవిత్రమైన స్థితిని కల్పించాలనుకున్నా స్త్రీలే ఆధారం. కనుకనే, ఆడవాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక దివ్యమైన శక్తి కలదని భగవద్గీతలో నిర్ణయం చేశారు. దీనిని పురస్కరించుకొనియే, "సీతారామ, లక్ష్మీ నారాయణ, పార్వతీ పరమేశ్వర, రాధాకృష్ణ" అని వారికే మొట్టమొదటి స్థానం ఇస్తున్నారు. అంతవరకును పోనక్కర లేదు. భారత దేశమునే భరతమాత అని మాతృమూర్తిగా నిర్ణయిస్తూ వచ్చారు. ప్రకృతి మాతృమూర్తి. మనం క్రిందపడి నామంటే "అమ్మా" అంటున్నాము కాని, "అప్పా" అని మనం అనము. కనుకనే మాతృమూర్తులైన స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ లోకములో మన భారతదేశములో ఉంటుండాది. కనుక, ఉన్నతస్థాయికి కొనిపోవునదీ W నే; ఆధమ స్థాయికి కొనిపోవునది "w" నే" work, worship and wisdom- ఈ మూడింటియందు W ప్రధానంగా ఉంటుంటాది. ఇది ఉన్నతస్థాయికి తీసుకొనిపోతున్నాది. ఇంకా మూడు పదములు (words) ఉంటున్నాయి. ఈ W తో ఉండేటువంటివి. wine, women, and wealth" ఈ మూడూ, లో (low) స్థానానికి తీసుకొనిపోతుంటాయి.
(ఆ. పు. 72/73)