నీవున్న స్థానమును కాలమును పరిస్థితులను బట్టి ఆనాటి దేశకాల పరిస్థితులను స్మరించినచో రెండింటికి పొత్తు కుదరదు. అదే విధముగా ఈ వస్త్రము దేవుడు. ఈ ప్లేటు దేవుడు. ఈటంబ్లరు దేవుడు. ఈ టేబులు దేవుడు అని వస్త్రమును, ప్లేటును, టంబ్లరును, టేబులును దేవుని దగ్గరకు తీసికొనిపోవు. అందుకే "You may worship a picture as a God, but not God as a picture" అన్నారు. కాని ఆ దేవుడే టేబులు, ఆ దేవుడే ప్లేటు. ఆదేవుడే వస్త్రము, అవి దేవుణ్ణి మాత్రము ఈస్థానానికి దింపకండి. అదేవిధముగా నీవు కృష్ణుని - విశ్వసించాలె. కృష్ణుని ఆదర్శాన్ని నీవు అనుసరించాలె అని అనుకున్నప్పుడు నీవు కృష్ణుని దగ్గరకు పో. నీభావములు కృష్ణునితో చేర్పు, నీ తలపులంతా భారతములో చేర్చు. అప్పుడే భారతముయొక్క స్వరూపాన్ని నీవు గ్రహించటానికి అధికారము ఏర్పడుతుంది. - నీవు ఎప్పుడు ఉండవలసినది ఉన్నతస్థాయిలోనే. "Be on, not be low " కనుక నీవు ఉన్నత స్థాయికి పోవలె ననుకొన్నచో పవిత్రచరిత్రలు పఠించునప్పుడు ఉన్నత భావముల స్థాయికే వెళ్ళవలెను.
(నీ.వే. పు. 95/96)