భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున,
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్యేన ప్రవేష్టుం చ పరన్తప||
ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమవికాసమును చక్కగా చిత్రించుచున్నది. భక్తి యోగములో ముముక్షువునకు యీ వాక్యములు ప్రధానసోపానములు. జ్ఞాతుం అనగా శాస్త్రము గురువు ద్వారానో లేక యేమహనీయుని వాక్యముచేతనో యేగ్రంథ పఠనముచేతనో భగవంతుడున్నాడు అనే విషయాన్ని విశ్వసింపజేస్తుంది. శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడున్నాడు, అనే విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు. సాధకుడు. భగవంతుడున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నంత మాత్రమున వానికి తృప్తి చేకూరదు. ఇది ప్రాథమికస్థానము.
(శ్రీ స.గీ. పు. 41)