అనేక మంది భక్తులు స్వామి తమను ఇంటర్వ్యూకి పిలవాలని ఆశిస్తున్నారు. నేను మాత్రం ఎంతమందికని ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలవుతుంది? కనుకనే, ఈ సమావేశాలను ఏర్పాటు చేసి అందరికీ సమానంగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మాటలు తగ్గించుకోండి. అప్పుడే మీ నుండి మృగలక్షణాలు దూరమైపోతాయి. మృగ లక్షణాలను మీలో నింపుకొని మనిషిలా ప్రవర్తించాలంటే సాధ్యం కాదు. ముందు వాటిని తరిమివేయండి. మీలో ఏవైనా దుర్గుణాలు ప్రవేశించాయంటే, నేను పశువును కాదు, నేను రాక్షసుడను కాదు, నేను మానవుడను" అని మమ్మల్ని మీరు పదేపదే హెచ్చరించుకోండి. మానవుడే దేవుడుగా మారతాడు. భగవత్రేమను పెంచుకోండి. స్వామిదయము తెలుసుకోవడానికి ప్రేమ ఒక్కటే రాజమార్గం.
(స.సా.సె.96 పు.242)
నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇస్తూనే యున్నాను. అంతరాత్మ కాబట్టి మీరే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను మీలో యున్నాను. నేను ప్రేమ స్వరూపుణ్ణ, మీరూ ప్రేమ స్వరూపులే. ఇద్దరము ప్రేమ స్వరూపులమే.
(సాపు 449)
(చూ|| ప్రేమ)