చాలామంది తమ భార్యను గాని, భర్తను గాని, పిల్లలను గాని సంతృప్తి పరచలేరు. అటువంటి వారంతా ఏదో చేసి ఇతరులను సంతృప్తి పరచుట గొప్పతనం కాదు. "ఇంట గెలిచి - రచ్చగెలువు." మీ ఇల్లును చక్కబెట్టుకున్న తరువాత వీధిలోనికి పోయి సేవలు చేయాలి. అంతేగాని ఇంటిని విసర్జించరాదు. మన ఇంట్లో వారిని సంతృప్తి -పరచుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించగా మిగిలిన కాలాన్ని సమాజసేవలో ఉపయోగ పెట్టాలి. మీ ఇంట్లో వారిని బాధ పెట్టి, వీధిలోనికి పోయి సేవ చేయడమనేది - సాయి ఒప్పుకోడు. పునాది గట్టిగా లేకుండా గోడలు నిలువలేవు కదా! కనుక మొదటself చూసుకో, తరువాతనే help చేయి.
(శ్రీభ.ఉ. పు.124)