ఏడు ప్రాకారాల కోట
రామదాసు చెప్పాడు –
కోట ఏడుచుట్లురా కోటలోపల తోటరా
తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎల్లరా
పాటువైనది చెట్టురా పట్టు అయినది కొమ్మరా
పాటుతప్పి పట్టువిడిచితె పరబ్రహ్మయె చేరురా!
మానవత్వానికి ఏడురకములైన కోటలుంటున్నాయి. ఏమిటవి? కామక్రోధ మోహ మద మాత్సర్యములనే ఆరుకోటలుంటున్నాయి. అన్నింటికంటే పెద్ద కోట ఏడవది దేహాభిమానము. ఈ ఏడు కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు. క్రింద ఉన్నది చెట్టు. చేతిలో పట్టు కొన్నది కొమ్మ, కొమ్మ విరిగిపోతే నీకేమి గతి? భగవతుడే చెట్టు వంటి వాడు. గురువులు కొమ్మలవంటివారు. చెట్టును ఆశ్రయించిన వారికి ఏమి ప్రమాదము జరగదు. దైవమే నిజమైన గురువు.
(శ్రీ స. పు.84/85)
(చూ|| దైవం కోసం)