ఏ తండ్రి అయినా తన ఆస్తిని తన మాట ప్రకారం నడచుకొని, తనను గౌరవించే కుమారునికి అప్పగిస్తాడు. మాటను గౌరవించక ఎదురు తిరిగిన కుమారునికి యివ్వడుకదా! అదే విధంగా లోకపిత అయిన భగవంతుడు భగవద్విశ్వాసమును అభివృద్ధి పరచుకొని, అతని ఆజ్ఞలను పాటించే వానికే తన దయను, అనుగ్రహమును అందిస్తాడు.
(భ.ప్ర.ప.పు.28)