ఎటాచ్మెంటు (Love)

నీకు Love (ప్రేమ) ఉన్నదనుకుంటున్నావు. చాల పొరపాటు. నీకున్నది Attachment. ఈ రెండింటికీ చాల తేడా ఉన్నది. నీ ప్రేమను వివిధములైన లౌకిక మార్గాలలో ప్రసరింపజేసివినియోగించుకొని Attachments మునిగిపోయావు. కనుకనేఅసలైన ప్రేమను విస్మరించావు. బిడ్డలపై గల ప్రేమను వాత్సల్యమంటారుభార్యపై గల ప్రేమను అనురాగమంటారువస్తువులపట్ల గల ప్రేమను మమకారమంటారు. స్నేహితుల పై గల ప్రేమను మైత్రి అంటారు. ఈ ప్రకారం వాత్సల్యముఅనురాగము,మమకారముస్నేహము అను విభిన్న మార్గములలో ప్రసరించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దీనివి Attachment అనవచ్చును. ఇది ప్రాపంచికమైనది. భౌతికమైనదిలౌకికమైనది. స్వార్థ సంకుచితమైనది. దీని వల్ల నీకు లభించేది భౌతికానందము,లౌకికానందము,ప్రాపంచికానందము,ఇంద్రియానందము,మానసికానందము,మనోభీష్టములను ఇంద్రియముల ద్వారా అనుభవించినప్పుడు కలిగేది సంతోషము. ఈనాడు నీకు సంతోషాన్నందించినది. రేపు అసౌకర్యాన్ని కల్గించవచ్చును. ఉదాహరణకులడ్డు నీకు ఇష్టమే. కానిమలేరియా జ్వరం వచ్చినప్పుడు అది అయిష్టంగా ఉంటుంది. ఉన్నికోటు నిన్ను చలికాలంలో సంతోషంగా ఉంచుతుంది. అదే కోటు వేసవిలో ఇబ్బందిని కల్గిస్తుంది. ఈ ప్రకారం సంతోషము కాలస్థితిగతులపై ఆధారపడి యున్నది. Attachment నుండి లభించేది కూడా ఇలాంటిదే. Attachment దుఃఖానికి కూడా కారణమౌతుంది. రామునిపై గల Attachment వలన దశరథుడు పుత్ర వియోగమును భరించలేక మరణించాడు. కైకకు తన పుత్రుడైన భరతునిపై గల Attachment రాముని వనవాసమునకు కారణమైనది. ధృతరాష్ట్రుడు తన పుత్రులైన కౌరవుల పై గల Attachment చేత వారి చర్యలన్నింటినీ సమర్థిస్తూ రావడంచేత తుదకు వారు దుర్మరణం పాలైనారు. మహాభారత యుద్ధంలో ధర్మజుడు "అశ్వత్థామ హతః కుంజరఃఅన్నప్పుడు. "కుంజరఃఅనే మాట వినిపించకపోవడంచేత ద్రోణాచర్యుడుతన పుత్రుడైన అశ్వత్థామపై గల Attachment వలనప్రాణం వదిలాడు. యశోదకు కృష్ణునిపై గల Attachment వలన ఆమె ఆతని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయింది. కనుకAttachment అనేది సత్యాన్ని పూర్తి గ్రహించనీయక మానవణ్ణి మాయకు లోబడేటట్లు చేస్తుంది. ఈ Attachment ను మోహం అనవచ్చును. కానిప్రేమ దీనికి పూర్తిగా భిన్నమైనటువంటిది. దశరథుడు కైకపై గల Attachment వలనకుమారుడైన రామునిపై గల Attachment వలన దుర్గతి పాలైతేరాముడు సత్యధర్మములపై గల ప్రేమ చేత పితృవాక్య పరిపాలన నిమిత్తంరాజ్యము పై ఎట్టి మమకారమూ లేక వనమున కేగినాడు. తాను ప్రజావాక్య పరిపాలకుడగుటచేత ఒక చాకలివాని మాటలకు స్పందించి సీతను పరిత్యజించాడు. ఇదే Loveకు, Attachmentకు గల వ్యత్యాసం. దశరథునిదిAttachmentరామునిదిLove ఒకటిప్రమాదమును తెప్పించిందిరెండవది శాశ్వత కీర్తి నందించింది. కృష్ణుడు వ్రేపల్లెను వదలిన తరువాత తిరిగి అందులో ప్రవేశించలేదు. అయినా కృష్ణునిపట్ల గోపికలకు గల ప్రేమ ఏమాత్రమూ చలించలేదు. ప్రేమ దేనికీ లొంగదువొంగదు. కృంగదు. పొంగదు. సిద్ధార్థుడు తన భార్య ఆయిన యశోధరపైనకుమారుడగు రాహులుని పైన, Attachment ను కలిగియుండిన తాను బుద్దుడయ్యెడివాడాశిలువపై హింసకు గురి అవుతున్నప్పుడు క్రీస్తు తన దేహము పై Attachmentను వీడి, Father, they know not what they do. forgive - them" (తండ్రీవారు చేసేదేమిటో వారికి తెలియదు. వారిని క్షమించు) అని ప్రేమమూర్తియై తనను శిక్షించినవారిని కూడా రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఇది ప్రేమకు పరాకాష్ఠ. Attachment స్వార్థంతో కూడినది. బంధనను చేకూర్చుతుంది. కానిLove స్వార్థరహితమైనది, బంధవిమోచన కల్గిస్తుంది. Love lives by giving and forgiving: Attachment lives by getting and forgetting. ప్రేమ ద్వంద్వాతీతమైనది. అనంతమైనది,అపూర్వమైనది. అద్వితీయమైనది,నిరుపమానమైనది,ఆధ్యాత్మికమైనది,దివ్యమైనది. ప్రేమయే దైవందైవమే ప్రేమ. కాబట్టి,ప్రేమలో జీవించండి. Attachment సంతోషమును అందిస్తేప్రేమ Bliss (ఆనందము) ను అనుగ్రహిస్తుంది. పుట్టిన బిడ్డకు తల్లి తప్ప మరొక ధ్యాస ఉండదు. కానిపెరుగుతున్న కొలది మానవుడు బాల్యములో ఆటపాటలపైనవిద్యార్థి దశలో చదువు సంధ్యల పైనయౌవనంలో కోరికల పైనమధ్యవయస్సులో ధనము పైన తన ప్రేమను మరల్చి Attachmentలో మునిగి మాయామోహితుడై జీవితమును వ్యర్థం గావించుకొనుచున్నాడు. భగవంతునిపై గల ప్రేమను భక్తి అన్నారు. ఇది వినయవిధేయతలనుశీలమును కాపాడిఆనందమును అనుభవింపజేసి జన్మను సార్థకం గావిస్తుంది. "ప్రేమను ఎట్లా పెంచుకోవాలి?" అని అడిగినావు. ఈనాడు కావలసినది Expansion of love (విశాలమైన ప్రేమ). నీవు ప్రారంభంలో కుటుంబాన్నితరువాత ఇరుగుపొరుగు వారినిఅటుపిమ్మట సమాజాన్నిక్రమేపి దేశాన్నిచిట్టచివరికి విశ్వాన్ని ప్రేమించడం లక్ష్యంగా పెట్టుకో. ప్రేమమయుడైన భగవంతుణ్ణి ప్రేమ ద్వారానే అనుభవించగలవు. ఈ జగత్తులో ఏది లేనివారైనా ఉంటారేమోగానిప్రేమ సహజముభగవత్రసాదము.

(స. సా.ఆ. 2000 పుట 255/256)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage