భగవంతుడెక్కడ వున్నాడు? పిల్లలు చేసే అల్లరిలో ఆయనే వున్నాడు. పక్షులు చేసే సందడిలో ఆయనే వున్నాడు. ఆకులు రెపరెపల్లో ఆయనే వున్నాడు. కొండలు చేసే ప్రతి ధ్వనిలో ఆయనే వున్నాడు. అంతటా నిండి వున్న ఓంకారాల లోనూ ఆయనే వున్నాడు. ఆయన లేనిది ఎక్కడ? ఆయన అంతటావున్నాడు. ఆయన అంతటా వున్నా ఒకంతట చిక్కడు. ఆయనను గుర్తించటానికి ఋషులు అనేక మార్గాలు చెప్పారు. అయినా ఆయనను కనుగొనటం ఏ కొద్ది మందికో మాత్రమే సాధ్యం. అన్నీ అను గ్రహించేది ఆయనే.
(శ్రీసా.గీ.పు.3)