అమెరికా ప్రెసిడెంటు టెఱ్ఱరిష్టులను అంతమొందించి తీరాలి అన్నాడు. టెఱ్ఱరిష్టులు ఎవరు? క్రోధము మరియు అసూయలే టెఱ్ఱరిష్టులు. ఈ దుష్ట లక్షణములు ప్రతి మనిషి ఆందు ఉంటాయి. మానవుడు వీటిని నాశనం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలి. మనుష్యులు ఒకరి నొకరు చంపుకోకూడదు. దానికి బదులుగా తమలో అంతర్గతముగా ఉన్న టెఱ్ఱరిష్టులను నాశనము చేయాలి.మంచి నడతలను అలవర్చుకోవాలి. ఇదే నేను మీ నుండి కోరేది. - ఎప్పుడైతే అసూయా క్రోధములు పూర్తిగా నిర్మూలమౌతాయో అప్పుడు దేశము సంపదలతో ప్రపంచమునకు ఒక ఆదర్శంగా ఉంటుంది.
(ది.ఉ. 19.01.2002)