గుళ్లోకి వెళ్లి టెంకాయ పగలగొట్టినప్పుడు మీ అహంకారమును బద్దలు కొట్టినట్లు అనుకోవాలి. కొబ్బరి దేవుడు ఆరగిస్తాడని కాదు. వివేకమనే ఒక్క దెబ్బతో అహంకారమును రెండు ముక్కలు చెయ్యటానికి అది సంకేతం. టెంకాయ మీది పీచు తీసినప్పుడే అది ఒక్క దెబ్బకు పగులుతుంది. అలాగే మనిషి తన హృదయం చుట్టూ పీచులాగా పట్టిన కామక్రోధాలూ ఆసూయా తొలగించుకోవాలి.
మానవుడు మహాశక్తి సంపన్నుడు. దుర్వాసనల మూలాన దుర్బలుడు అవుతున్నాడు. మీలో వున్నదివ్యశక్తిని గుర్తించి ఉత్తేజం పొందండి. అప్పుడు మీకు మంచితనమూ త్యాగ గుణమూ నిజాయితీ ఆప్యాయతా అలపడగలవు. మంచి మాటలు వినండి. మంచి దృశ్యలు చూడండి. మంచి ఆలోచనలు చేయండి. మంచి పనులు ఆచరించండి. అప్పుడు దుష్ట ప్రవృత్తులన్ని నిర్మూలమైపోతవి.
(వ.1963 పు. 223/224)