ప్రతి మానవునకు ఒక Free will ఉన్నదని విశ్వసిస్తున్నారు. ఇది చాల పొరపాటు. వ్యక్తి సంకల్పము చేతనే, వ్యక్తి ప్రయత్నముల చేతనే, వ్యక్తి సాధనల చేతనే ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కర్తృత్వము యొక్క ప్రతిబింబము, అహంకారము యొక్క వికారము.
(బృత్ర.పు.136)
మానవులలో , ఫ్రీవిల్ అనేది ఉండటానికి వీలే లేదు. నేనిప్పుడు నాకారులో ఇంటికి పోతానంటావు. కానీ, దారిలో నీ కారుకు ఏమైనా కావచ్చు. ఇంక “ఫ్రీవిల్" ఎక్కడ ఉంది నీకు? ఏ కార్యం చేయాలనుకున్నా ఫ్రీవిల్ లేకపోతే, అది ఫలిస్తుందో లేదో అని సందేహాలు వస్తాయి. నీవు ఏది చేయాలనుకున్నా అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఒక్క భగవంతునికి మాత్రమే ఈ ‘ప్రీవిల్’ అనేది ఉన్నది. ఇంకెవ్వరికీ లేదు. "నాకు ఫ్రీ-విల్ ఉంది. నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను" అని నీవు భ్రమించవచ్చు. అది నీ కోరిక యొక్క లక్షణమే కాని ఫ్రీవీల్ కానే కాదు. ఒక్క దైవానుగ్రహం చేతనే దానిని మనం పొందడానికి వీలవుతుంది.
(శ్రీ భ.ఉ.పు.188)