పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు
ప్రతి మానవుండును బ్రతికి తానుండుట
స్వార్థంబునకు కాదు సంఘసేవ
చేయుటకే నన్న శ్రేష్టభావంబుతో
మెలగుచు నుండిన మేలుకలుగు
మరచియు తను దాసు మానవ సేవకు
అంకిత మొసగుటే ఆత్మతృప్తి
నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని
సకల జీవులకు పకృతి పలుపకున్న
పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు
ఇంతకన్నను వేరెద్ది యెఱక ప ఱుతు?
(యు.సా.పు.63)